శేరిలింగంపల్లిలోని మియాపూర్ డివిజన్ వ్యాప్తంగా సుమారు రూ. 4.72 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గాంధీ, కార్పొరేటర్ శ్రీకాంత్ కలిసి శంకుస్థాపన చేశారు. సీసీ రోడ్లు, రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు FCI కాలనీ, అరబిందో కాలనీ, ప్రశాంత్ నగర్ సహా 10 ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు, ప్రజలు పాల్గొన్నారు.