న్యాయవాది మొయినుద్దీన్ హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రమేయం ఉన్న హైదరాబాద్‌కు చెందిన రాజకీయ నేతతోపాటు ఆయన కుమారుడిని పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వక్ఫ్ బోర్డు నుంచి సదరు రాజకీయ నేతను తప్పించాలని న్యాయవాది మొయినుద్దీన్ ప్రయత్నించడంతో, రూ. 15 లక్షల సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని మలక్‌పేట, లక్డీకాపూల్, మల్లేపల్లి భూముల వివాదంలో ఈ హత్య జరిగిందని పోలీసుల విచారణలో వెల్లడయింది.