మాదాపూర్ పోలీసులు ఒక పాత నేరస్తుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడి నుండి సుమారు 3.5 లక్షల రూపాయల విలువైన 7 దొంగిలించబడిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. చంద్రనాయక్ తండా రోడ్డులో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని పోలీసులు ఆపి తనిఖీ చేయగా, సరైన పత్రాలు చూపలేకపోయాడు. పోలీసుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అతడిని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు.