భాగ్యనగరంలో బాలుడి హత్య..?

0చూసినవారు
టోలిచౌకిలోని నైస్ జ్యూస్ సెంటర్లో పనిచేస్తున్న ఇద్దరు యువకుల మధ్య జరిగిన గొడవ ఒక బాలుడి హత్యకు దారితీసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత చిన్న విషయమై మోఫిల్ (19) అనే యువకుడు, గుల్జార్ ఆలం (16) అనే బాలుడి తలపై గరిటెతో కొట్టడంతో ఆలం అక్కడికక్కడే మృతి చెందాడు. భాగ్యనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడు, నిందితుడు బీహార్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్