
నంద్యాల ఫ్యాక్షన్ హత్య కేసు.. 12మందికి యావజ్జీవ శిక్ష
నంద్యాల జిల్లాలో సంచలనం సృష్టించిన ఫ్యాక్షన్ హత్య కేసులో ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2012లో జరిగిన ఇంజేడు కృష్ణారెడ్డి సహా నలుగురి హత్య కేసులో 12 మంది నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మొత్తం 18 మంది నిందితుల్లో నలుగురు ఇప్పటికే మృతి చెందారు. ఈ తీర్పుతో బాధితుల కుటుంబాలకు న్యాయం జరిగినట్లు భావిస్తున్నారు.




