శుక్రవారం, 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ కాలనీలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ కాలనీవాసులతో కలిసి పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న రోడ్డు పనులు ప్రారంభమయ్యాయని, నాణ్యత ప్రమాణాలతో యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, వర్షపు నీరు నిలిచిపోకుండా లెవెలింగ్ సక్రమంగా చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గుడ్ల శ్రీనివాస్, నవీన్, సురేష్, కాలనీవాసులు పాల్గొన్నారు.