రంగారెడ్డి: అలర్ట్.. రాబోయే రెండు గంటల్లో వర్షం

3చూసినవారు
రంగారెడ్డి: అలర్ట్.. రాబోయే రెండు గంటల్లో వర్షం
తెలంగాణలో రాబోయే 2 గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సూచించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 5 మి.మీ. మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇటీవల వరకు ఎండలు దంచికొట్టగా, ఇప్పుడు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి.