ఆరెకపూడి గాంధీ, గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా రివైటల్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభం

334చూసినవారు
ఆరెకపూడి గాంధీ, గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా రివైటల్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభం
హైదర్‌నగర్ డివిజన్ పరిధిలోని హెచ్‌ఎమ్‌టి శాతవాహన నగర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన “రివైటల్ డెంటల్ హాస్పిటల్”ను పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ, తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ, ఆధునిక సౌకర్యాలతో ప్రారంభించిన ఈ ఆసుపత్రి ద్వారా పరిసర ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి వారికి సరసమైన ధరలకు మెరుగైన దంత వైద్యం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్