
'గోళ్లను పీకి.. వేళ్లను నరికి'.. ముగ్గురు యువతుల దారుణ హత్య
అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్ లో ముగ్గురు యువతులను దారుణంగా హతమార్చారు. మోరెనా వెర్డి(20), బ్రెండా డెల్(20), లారా గుటియెర్రెజ్(15) అనే యువతులు ఈ నెల 19న మిస్సయ్యారు. వారి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే 5రోజుల తర్వాత ఓ చోట మృతదేహాలు పాతిపెట్టి ఉన్నట్లు సమాచారం రాగా పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వారిని హింసిస్తున్నపుడు ఓ దుండగుడు ఇన్ స్టా ఖాతాలో లైవ్ టెలీకాస్ట్ చేశాడని, అందులో యువతుల గోళ్లను పీకి.. వేళ్లను నరికి చంపినట్లు లైవ్ చూసిన కొందరు పోలీసులకు తెలిపినట్లు సమాచారం.




