చందానగర్, రాజీవ్ నగర్‌లలో విద్యుత్ అధికారుల ప్రత్యేక డ్రైవ్

232చూసినవారు
చందానగర్, రాజీవ్ నగర్‌లలో విద్యుత్ అధికారుల ప్రత్యేక డ్రైవ్
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని చందానగర్ వెంకటేశ్వర కాలనీ, రాజీవ్ నగర్‌లలో విద్యుత్ అధికారులు శనివారం  ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ నేతృత్వంలో అధికారులు ప్రతి వీధిలో పర్యటించి, కాలనీవాసుల సమస్యలను అడిగి తెలుసుకొని, తక్షణమే పరిష్కరించారు. ఈ డ్రైవ్‌లో లైన్ ఇన్‌స్పెక్టర్ బ్రహ్మం, లైన్‌మ్యాన్ రాజు నాయక్, మహేష్ రాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్