వేమన రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభం

302చూసినవారు
వేమన రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయం ప్రారంభం
చందానగర్ డివిజన్‌లోని వేమన రెడ్డి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, ఆమె భర్త రఘునాథ్ రెడ్డి పాల్గొన్నారు. కాలనీ వాసుల సమష్టి కృషితో కార్యాలయం నిర్మాణం పూర్తయిన సందర్భంగా, అసోసియేషన్ సభ్యులు కార్పొరేటర్ దంపతులకు ఘన స్వాగతం పలికారు. కొత్త కార్యాలయం కాలనీ అభివృద్ధి, నివాసితుల సంక్షేమానికి కేంద్రంగా మారాలని కార్పొరేటర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జనరల్ సెక్రటరీ నాగిరెడ్డి, కార్యవర్గ సభ్యులు, కాలనీ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్