శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల కూరగాయల మార్కెట్‌ను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ బుధవారం పరిశీలించారు. యుద్ధ ప్రాతిపదికన అత్యవసర అభివృద్ధి పనులను గుర్తిస్తున్నట్లు, మార్కెట్‌ను మోడల్ మార్కెట్‌గా తీర్చిదిద్దే దిశగా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులతో కలిసి సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అసిస్టెంట్ ఇంజినీర్ భాస్కర్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి చింతకింది రవీందర్ గౌడ్, ఉపాధ్యక్షుడు ఖాజాపాషా, ఎస్‌ఎల్‌వీడీసీ అధ్యక్షుడు రవి యాదవ్, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, రషీద్, మహమ్మద్ అజీమ్, సురేష్ రాథోడ్, రాజు, మొయిన్, దాదు, దత్తరెడ్డి, షరీఫ్, లాల్, చందు తదితరులు పాల్గొన్నారు.