
గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం: ఎమ్మెల్యే
గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిన్న ఎలికిచర్ల గ్రామం అభివృద్ధిలో వెనకంజ వేసిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికలు చేపడుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ తెలిపారు. ఆదివారం కొందూరు మండలం చిన్న ఎలికిచర్ల గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరాఠి రాజు, డిప్యూటీ సర్పంచ్ మహేష్ యాదవ్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మర్యాదపూర్వకంగా కలిసి తమ గ్రామాభివృద్ధికి హామీ పొందారు.







































