షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు పోలీస్ స్టేషన్ సీఐగా పనిచేసిన నరసింహారావు బదిలీపై వెళ్తున్న సందర్భంగా, ఆయనకు సహచర సిబ్బంది శనివారం ఘనంగా వీడ్కోలు పలికారు. స్టేషన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సిబ్బంది ఆయనపై పూల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా నరసింహారావు తనతో కలిసి పనిచేసిన సహచర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్టేషన్ సిబ్బంది ఆయనను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఐ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.