రంగారెడ్డి జిల్లా చౌదరిగుడ మండలం ఎలుకగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచి బందెయ్యపై అదే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాంరెడ్డి రెడ్డి, అతని అనుచరులు హత్యాయత్నం చేశారు. ఈదమ్మ జాతర సందర్భంగా సర్పంచి బందెయ్య ఏర్పాట్లు చేస్తుండగా, శనివారం సాయంత్రం రాంరెడ్డి రెడ్డి తన అనుచరులతో కలిసి మరణాయుధాలతో దాడికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.