రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఫరూఖ్‌నగర్ ఈద్గా వద్ద బక్రీద్ పండుగ వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భీష్మ కిష్టయ్య, మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్,
కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు కొంకళ్ల చెన్నయ్య కూడా పాల్గొన్నారు. వీరంతా ముస్లిం సోదరులతో కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.