మహిళలంతా ముందుకు కదిలి మహిళా శక్తిని చాటాల్సిన తరుణం ఆసన్నమైందని, బీసీ మహిళల అభ్యున్నతికి ప్రతి ఒక్కరం కృషి చేయాలని జాతీయ బీసీ సేన మండల మహిళా అధ్యక్షురాలు జక్కుల జలజ అన్నారు. ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి, బుజ్జి గూడ గ్రామంలో ఆదివారం గ్రామ కమిటీలను ఆమె ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సామాజిక సమస్యలపై పోరాడేందుకు ప్రతి బీసీ మహిళ ముందుకు రావాలని కోరారు.