రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా బీజేపీ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే షాద్‌నగర్ అభివృద్ధి కుంటుపడిందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను మోసం చేశాయని నేతలు రాజ్ భూపాల్ గౌడ్, శ్రీవర్ధన్ రెడ్డి ఆరోపించారు. పట్టణానికి కేవలం కేంద్ర నిధులే ఆధరువుగా నిలుస్తున్నాయని, స్వచ్ఛమైన పాలన కోసం బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా డప్పు మేళాలతో భారీ ర్యాలీ నిర్వహించారు.