ఫరూక్ నగర్ మండలం కంసాన్ పల్లి గ్రామంలో బిజెపి అభ్యర్థి ఆవశేఖర్ అనుమానాస్పద మృతి నేపథ్యంలో, రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు రాంభూపాల్ గౌడ్ కాంగ్రెస్, బిఆర్ఎస్ నాయకులను హెచ్చరించారు. బుధవారం గ్రామానికి వెళ్లి మృతుడి అంత్యక్రియల్లో పాల్గొన్న ఆయన, యువకులను రాజకీయాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.