షాద్‌నగర్ నియోజకవర్గం లింగారెడ్డిగూడ గ్రామంలో డ్రైనేజీ సమస్య ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గ్రామ శివారులో హైవే రోడ్డు పక్కనే ఉన్న మదర్సా, మస్జిద్ సమీపంలో షాద్‌నగర్ వైపు నుంచి వస్తున్న అండర్ డ్రైనేజీ మురికి కాలువ దుర్వాసన వెదజల్లుతోంది. ప్రతిరోజూ ఈ మార్గంలో వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురిసిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. డ్రైనేజీ నీరు ఏరులై పారుతూ రోడ్డుపైకి చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పుకుంటున్నప్పటికీ కొన్ని చోట్ల కనీస మౌలిక వసతులు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతున్నాయి.