కొందుర్గు మండలంలోని లక్ష్మీదేవునిపల్లి గ్రామంలో శనివారం రూ. 10 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ స్కీమ్ (NREGS) నిధులతో ఈ పనులు జరుగుతాయి. మండల
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోగురి పురుషోత్తం రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి, గోవర్ధన్ గౌడ్‌లు శంకుస్థాపన చేశారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తయితే గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని నాయకులు తెలిపారు.