రాష్ట్ర పంచాయతీరాజ్, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పర్యటనలో స్వల్ప మార్పులు జరిగినట్లు శుక్రవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీఖాన్ బాబర్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు షాద్ నగర్ పట్టణంలోని కేశంపేట బైపాస్ చౌరస్తాలో మంత్రి సీతక్కను ఎమ్మెల్యే శంకర్ ఆహ్వానించనున్నారు.