షాద్ నగర్ లో మున్సిపాలిటీ అధికారులు తమ కార్యాలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. అయితే, ఇతర కార్యాలయాల ఇబ్బందులను మాత్రం పట్టించుకోవడం లేదు. పరిగి రోడ్డులోని విద్యుత్ శాఖ కార్యాలయంలోకి మురుగునీరు నేరుగా చేరుతోంది. దీంతో వినియోగదారులు, సిబ్బంది దుర్గంధంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలోకి వచ్చి దుర్గంధాన్ని భరించలేక చీదరించుకుంటున్న వినియోగదారులు, మున్సిపల్ కమిషనర్ ను ఈ పరిస్థితిపై ప్రశ్నిస్తున్నారు.