విద్యార్థుల కోసం కంప్యూటర్ డెస్క్ టాప్ లు

2చూసినవారు
విద్యార్థుల కోసం కంప్యూటర్ డెస్క్ టాప్ లు
ఫరూక్ నగర్ మండలం చించోడు జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు గెజిటెడ్ హెడ్మాస్టర్ రసూల్ ఆధ్వర్యంలో సోమవారం ఒక సంస్థ రూ. 2 లక్షల విలువైన 20 కంప్యూటర్ డెస్క్ టాప్ లను అందజేసింది. పాఠశాలలో కంప్యూటర్ తరగతులను నిర్వహించేందుకు ఈ డెస్క్ టాప్ లను సంస్థ ఫైనాన్స్ మేనేజర్ వంశీకృష్ణ కులకర్ణి ఎంఈఓ మనోహర్ ద్వారా పాఠశాలకు అందజేశారు. ప్రభుత్వం, దాతలు విద్యార్థులకు అండగా ఉన్నారని, వారు చక్కగా చదువుకొని భవిష్యత్తు వైపు ఎదగాలని ఎంఈఓ మనోహర్ ఈ సందర్భంగా అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్