ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకోత్సవాన్ని పురస్కరించుకుని షాద్‌నగర్ పట్టణంలో ఘనంగా నివాళి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహానికి ప్రజాప్రతినిధులు, నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. 1674లో రాయగడ్ కోటలో జరిగిన శివాజీ మహారాజ్ పట్టాభిషేకం భారత చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, స్వరాజ్య సాధన కోసం ఆయన చేసిన కృషి దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని నాయకులు కొనియాడారు. హైందవ స్వరాజ్య స్థాపనకు శ్రీకారం చుట్టిన శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలను ప్రశంసించారు.