గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి: రమేష్

6చూసినవారు
గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలి: రమేష్
గో సండే కార్యక్రమంలో భాగంగా, ఉమ్మడి రంగారెడ్డి & మహబూబ్ నగర్ జిల్లా బాల్ నగర్ మండలం ఎమ్మార్వో కార్యాలయంలో విశ్వహిందూ పరిషత్ మరియు హిందు వాహిని నాయకులు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని వినతి పత్రాన్ని అందజేశారు. విశ్వహిందూ పరిషత్ ప్రాంత నాయకులు బండారి రమేష్ మాట్లాడుతూ, భారతదేశంలో గోవుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని, గోవు ఆధారిత ఉత్పత్తులతోనే జీవనం కొనసాగుతుందని, వ్యవసాయం, పాల పరిశ్రమలు, పౌష్టికాహార ఉత్పత్తులలో గోవు కీలక పాత్ర పోషిస్తుందని, హిందూ ధర్మంలో గోమాతగా పూజించడం భాగమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్