షాద్ నగర్ దేవాలయంలో భక్తుల సందడి

69చూసినవారు
షాద్ నగర్ దేవాలయంలో భక్తుల సందడి
తొలి ఏకాదశి సందర్బంగా రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ టౌన్ లో భారీగా భక్తులు శ్రీదేవి భూదేవి సమేత జానంపేట వెంకటేశ్వర స్వామి దర్శనం నిమిత్తం భారీగా భక్తుల సందడి మొదలైంది. ఏకాదశి పర్వదినాన ఆదివారం సెలవు కూడా కావడంతో కుటుంబ సమేతంగా భక్తులు పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు కల్పించారు. అలాగే శ్రీవారి ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్