షాద్ నగర్ లో ఘనంగా దత్త పౌర్ణమి వేడుకలు

1చూసినవారు
షాద్ నగర్ పట్టణంలోని శివ మారుతి గీత అయ్యప్ప దేవాలయంలో దత్తాత్రేయ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు దత్త పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం దత్తాత్రేయ స్వామికి ప్రాతకాల సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం, సహస్ర పుష్పార్చన, దత్త హోమం, డోలారోహణోత్సవం, మహా మంగళ హారతి, తీర్థ ప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు లస్కర్ ఆంజనేయులు గుప్త, ప్రధాన కార్యదర్శి రేటికల్ నందీశ్వర్, కోశాధికారి దాస కృష్ణయ్య, రాజశేఖర్ రెడ్డి, గుబ్బ ప్రకాష్, హరిబాబు, మురళి నరసింహ చారి, మరియు పట్నానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :