షాద్ నగర్ లో కాసోజు శ్రీకాంత్ చారి వర్ధంతి వేడుకలు

1చూసినవారు
షాద్ నగర్ లో కాసోజు శ్రీకాంత్ చారి వర్ధంతి వేడుకలు
తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ చారి 16వ వర్ధంతి సందర్భంగా బుధవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ అంబేద్కర్ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల వెల్ఫేర్ అసోసియేషన్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి. వెంకట్ రాంరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఉద్యమకారులకు గుర్తింపు పత్రాలు, ప్లాట్లు ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రితో సంప్రదించి ఉద్యమకారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 'శ్రీకాంత్ చారి అమర్ హై' అంటూ ఉద్యమకారులు నినాదాలు చేశారు.

ట్యాగ్స్ :