సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

2చూసినవారు
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
షాద్ నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం నిరంతరం సహాయం అందిస్తుందని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తుందని తెలిపారు. శుక్రవారం షాద్ నగర్ పట్టణ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, నియోజకవర్గంలోని కొత్తూరు, నందిగామ, కేశంపేట మండలాలకు చెందిన 65 మంది బాధితులకు 23.24 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు.