ఎమ్మెల్సీ కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి

0చూసినవారు
ఎమ్మెల్సీ కార్యాలయంలో సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి
ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సిఫారసు మేరకు షాద్ నగర్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. అప్పారెడ్డిగూడ, బుగ్గోనిగూడ, ఈదులపల్లి, మామిడిపల్లి, పిట్టలగూడ గ్రామాలకు చెందిన సబ్జా అనసూయ, దివిటీ అంజయ్య, నాగుల నరసింహ, రాగులపల్లి జగన్, రాళ్ల బండి పద్మమ్మ, కారె సింధు ప్రియా, గంగిశెట్టి పురుషోత్తంలకు ఈ చెక్కులు మంజూరయ్యాయి. ఎమ్మెల్సీ కార్యాలయంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్