షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట్ మండలం మాజీ జడ్పీటీసీ తాండ్ర విశాల శ్రావణ్ రెడ్డిల పెళ్లిరోజు సందర్భంగా షాద్ నగర్ మున్సిపాలిటీ శివ మారుతి గీతా అయ్యప్ప స్వామి దేవాలయంలో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్, విశాల శ్రావణ్ రెడ్డి దంపతులను శాలువతో సన్మానించి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అయ్యప్ప స్వాములకు బిక్షను ప్రారంభించారు.