
అమెరికాలో గొల్లపూడి వాసి మృతి
AP: అమెరికాలో ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన వ్యక్తి మృతి చెందారు. సూరపనేని గిరిధర్ వంశీ కృష్ణ (36) గుండె పోటుతో అక్కడ కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు అతడి సన్నిహితులు తెలియజేశారు. దీంతో గొల్లపూడిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుమారుడి మరణ వార్త తెలియడంతో తల్లిదండ్రులు గొల్లపూడి నుంచి అమెరికాకు బయలుదేరి వెళ్లారు.




