రంగారెడ్డి జిల్లా జిల్లేడుచౌదర్ గూడా మండలం ముష్టిపల్లి గ్రామంలో జాతీయ బీసీ సేన మండల అధ్యక్షురాలు ప్యాట జయ శ్రీకాంత్ ఆధ్వర్యంలో మహిళ బీసీ సేన గ్రామ కమిటీల ఎన్నిక శుక్రవారం జరిగింది. ఈ గ్రామ కమిటీ ఎన్నికకు ముఖ్య అతిధిగా షాద్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం బీసీ మహిళ అధ్యక్షురాలు బాస వరలక్ష్మి, షాద్ నగర్ టౌన్ అధ్యక్షురాలు కాటం భాగ్యలక్ష్మి గౌడ్, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు చెన్న బాలరాజ్ పాల్గొన్నారు.