షాద్ నగర్ నియోజకవర్గం జిల్లేడు చౌదరిగూడ మండలకేంద్రానికి చెందిన నిరుపేద మహిళ భీమమ్మ కూతురు వివాహం ఇటీవల జరిగింది. స్థానిక బీఆర్ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్ వారి ఆర్థిక పరిస్థితిని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ కి తెలియజేయగా తక్షణమే స్పందించి మంగళవారం స్థానిక నాయకులు హఫీజ్, జబ్బార్, వెంకటేష్, ఇస్మాయిల్ ద్వారా ఆర్థిక సహాయాన్ని భీమమ్మకి అందజేశారు.