
ఉద్యోగ హామీ నిలబెట్టుకున్నాం: సీఎం చంద్రబాబు
AP: మంగళగిరిలో కానిస్టేబుళ్లుగా ఎంపికైన 5,757 మంది అభ్యర్థులకు సీఎం చంద్రబాబు నియామకపత్రాలు అందజేశారు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని, నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్‌పై కేసులను పరిష్కరించి నియామకాలు పారదర్శకంగా నిర్వహించామని ఆయన తెలిపారు. తన ప్రభుత్వంలోనే ఉద్యోగాలు వస్తాయని, గతంలో 23 వేలకుపైగా పోలీసు ఉద్యోగాలు, మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని పేర్కొన్నారు.




