షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు మండలంలోని పెంజర్ల గ్రామ పంచాయతీలో 10 వార్డులకు గాను 4 వార్డుల ఎన్నికలు బుధవారం ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. మాజీ జెడ్పిటిసి మామిడి శ్యాంసుందర్ రెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ మామిడి జనార్దన్ రెడ్డి, మాజీ సర్పంచ్ సిద్ధార్థ రెడ్డి సమక్షంలో ఈ ప్రకటన వెలువడింది. ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డు సభ్యులు: 2వ వార్డు కావలి శేఖర్, 4వ వార్డు కమ్మరి వేదంత చారి, 6వ వార్డు మంద మాధవి, 8వ వార్డు దేశాల మాధవి. ఈ ఏకగ్రీవ ఎన్నికలకు సహకరించిన గ్రామ పెద్దలకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.