రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉచిత అంబలి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బార్ అసోసియేషన్ సభ్యులకు అంబలి అందజేసి వారితో కలిసి సేవించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బసవేశ్వర్ తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.