
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ప్రధాని మోదీ ఫోన్
భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్ ద్వారా సంభాషించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, ప్రపంచ పరిణామాలు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చ జరిగినట్టు సమాచారం. వ్యాపారం, సాంకేతికత, రక్షణ, భద్రత రంగాల్లో సహకారంపై కూడా సంభాషణ జరిగినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత పర్యటన ముగిసిన కొద్ది రోజులకే ఈ ఫోన్ కాల్ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.




