పేదింటి ఆడపడుచు వివాహానికి సాయం

0చూసినవారు
పేదింటి ఆడపడుచు వివాహానికి సాయం
ఫరూక్ నగర్ మండలం పీర్లగూడ గ్రామ సర్పంచ్ షమీం బేగం, తన కుమారులతో కలిసి గ్రామంలోని నిరుపేద కుటుంబాల్లో ఆడపడుచుల వివాహాలకు రూ. 10,000 ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఇటీవల గ్రామానికి చెందిన ఆకులముని సాయిలు-మంజుల దంపతుల కుమార్తె వివాహం నిశ్చయం కావడంతో, సర్పంచ్ షమీం బేగం తన దివంగత భర్త అజ్మీర్ ఘోరి పేరు మీద రూ. 10,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయాన్ని అందుకున్న సాయిలు-మంజుల కుటుంబ సభ్యులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.