షాద్ నగర్ పట్టణం 20వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త రాజమోని శివకుమార్ నిమ్స్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స కోసం అవసరమైన సహాయం విషయంలో, కౌన్సిలర్ పిన్నమోని గోపాల్, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చొరవతో ఎమ్మెల్సీ వాణి దేవి సహకారంతో రూ. ఒక లక్ష ఎల్ఓసి మంజూరు చేయించారు. గురువారం బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చేగూరి వేణుగోపాల్ లబ్ధిదారుడికి ఎల్ఓసి అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి చీపిరి రవి యాదవ్, కౌన్సిలర్లు పిల్లి శారద శేఖర్, జయలక్ష్మి కిషోర్, ఎస్పీ శివ తదితరులు పాల్గొన్నారు.