షాద్‌నగర్ లో ఎరువుల దుకాణాల తనిఖీ

1చూసినవారు
షాద్‌నగర్ లో ఎరువుల దుకాణాల తనిఖీ
రైతులు ఎరువుల కోసం పడుతున్న ఇబ్బందులను, క్షేత్రస్థాయిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టేందుకు ప్రభుత్వం 'ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్'ను ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిందని రాష్ట్ర వ్యవసాయ కమిషనరేట్ అదనపు డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో స్థానిక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి రాఘవేంద్ర ఫర్టిలైజర్ తదితర షాపులను ఆయన పరిశీలించి తనిఖీ చేశారు. నందిగామ మండలంలోనూ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఈ యాప్ పనితీరును, డీలర్ షాపుల వద్ద అమలవుతున్న విధానాన్ని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి తనిఖీలు చేపట్టారు.