మృతుడు శేఖర్ తల్లి కవిత కీలక వ్యాఖ్యలు

3చూసినవారు
కంసాన్ పల్లి గ్రామానికి చెందిన ఆవశేఖర్ తల్లి కవిత బుధవారం మీడియాతో మాట్లాడుతూ, తన కొడుకు శేఖర్ ను టిఆర్ఎస్ నాయకులు పోటీ నుంచి తప్పుకోవాలని బలవంతం చేశారని, లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారని తెలిపారు. శేఖర్ ఒప్పుకోకపోవడంతో, మళ్లీ వచ్చి బెదిరించి, 'నీ సంగతి చూస్తాం' అని తన ముందే అన్నారని కవిత ఆరోపించారు. శేఖర్ మృతికి కారణమైన వారికి కూడా అలాంటి చావే రావాలని ఆమె పేర్కొన్నారు. శేఖర్ ను నిన్న ఇద్దరు బైక్ పై ఎక్కించుకొని వెళ్లారని, ఆ తర్వాత అతను తిరిగి రాలేదని, రాత్రి చనిపోయాడని చెప్పారని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్