ఇందిరమ్మ లబ్ధిదారులకు మహర్దశ: మాజీ ఎమ్మెల్యే

1చూసినవారు
ఇందిరమ్మ లబ్ధిదారులకు మహర్దశ: మాజీ ఎమ్మెల్యే
షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ఇందిరమ్మ లబ్ధిదారులకు ప్రభుత్వం మహర్దశ కల్పించిందని, లబ్ధిదారులు ఎంతో ఆనందంగా ఉన్నారని తెలిపారు. కొందుర్గు మండలం పర్వతాపూర్ గ్రామంలో అనూష, రమేష్ దంపతులకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన గృహంలో యజమానులు నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించి సన్మానించారు.