కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు

0చూసినవారు
కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వలసలు
సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లేడు చౌదరిగూడ మండలం రావిర్యాల గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కమ్మరి శివకుమార్, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ సమక్షంలో మంగళవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర సాధకులు, రైతు సంక్షేమ సారధి కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతోనే బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు శివకుమార్ పేర్కొన్నారు. కేసీఆర్ పాలనలోనే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని, రైతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్