షాద్ నగర్: జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

84చూసినవారు
షాద్ నగర్: జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
షాద్ నగర్ పట్టణంలో గత కొంతకాలంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ విచ్చలవిడిగా కరుస్తున్న వీధి కుక్కల భారి నుండి కాపాడడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వాటి నియంత్రణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు. షాద్ నగర్ పట్టణ శివారులోని ఫరూక్ నగర్ బొబ్బిలి చెరువు శివారులో జంతు జనన నియంత్రణ కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే లాంచనంగా శుక్రవారం ప్రారంభించారు.
Job Suitcase

Jobs near you