బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శ్రీకారం

2చూసినవారు
బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శ్రీకారం
నియోజకవర్గంలోని రాయికల్ నుంచి విట్యాల వరకు అత్యంత కీలకమైన 9 కిలోమీటర్ల బీటీ రోడ్డు విస్తరణ పనులకు మంగళవారం భూమి పూజ జరిగింది. సుమారు 12 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులను షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రారంభించారు. రాయికల్ సర్పంచి జ్యోతి శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాయికల్ కమాన్ వద్ద వేద మంత్రోచ్ఛారణల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం, ఎమ్మెల్యే స్వయంగా జెసిబితో పనులను ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్