షాద్‌నగర్ పట్టణాన్ని క్లీన్ అండ్ గ్రీన్‌గా మార్చేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం ఉదయం మున్సిపాలిటీలో కమిషనర్ సునీతా రెడ్డి ఆధ్వర్యంలో రూ. 50 లక్షల నిధులతో డ్రైనేజ్ పైపులను శుభ్రపరిచే జట్టింగ్ వాహనాన్ని, రూ. 5 లక్షల విలువైన స్లీపింగ్ వాహనాలను ఎమ్మెల్యే లాంచనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమాలు పట్టణ పారిశుద్ధ్య నివారణలో విప్లాత్మక మార్పులు తీసుకువస్తాయని ఆయన తెలిపారు.