జూలై 12 న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పర్యటనకు రానున్నట్లు జాగృతి నాయకులు మీడియాకు తెలిపారు. శనివారం ఉదయం 10:00 గంటలకు కేశంపేట్ మండలం వేముల నర్వ గ్రామంలో చిర్ర మహేష్ ఆధ్వర్యంలో స్వాగతం కార్యక్రమం ఏర్పాటు చేశారు. అదే విధంగా గ్రామంలో జాగృతి కార్యాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభిస్తారు.