కొందుర్గు మండలంలోని ఉత్తరసిపల్లి గ్రామపంచాయతీలో మంచి నీటి సమస్యను గ్రామ సర్పంచ్ గీత, డిప్యూటీ సర్పంచ్ హలీం, గ్రామ ప్రజలు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల నీటి ఇబ్బందులను తీర్చేందుకు, ప్రభుత్వం నుండి నిధులు రాకపోయినా, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి తన సొంత నిధులతో బోర్ వేయిస్తానని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు సోమవారం ఉత్తరసిపల్లి గ్రామంలో బోరు పనులు ప్రారంభమయ్యాయి. దీంతో గ్రామ ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేశారు.